telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

అధికారులు చట్ట ప్రకారం పనిచేయాలి : వర్లరామయ్య

Nimmagadda ramesh

ఏపీలో పంచాయితీ ఎన్నికల పైన వైసీపీ, టీడీపీల మధ్య రభస కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెదేపా నేతలు వర్ల రామయ్య,బోండా ఉమా,అశోక్ బాబు,వెంకటరాజు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ ను కలిశారు. ఈ సందర్భంగా వర్లరామయ్య మాట్లాడుతూ… ఏ నిబంధనల ప్రకారం మేనిఫెస్టో రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారని ఎస్ఈసీని అడిగాం. న్యాయస్థానం కు వెళ్లాలని ఎస్ఈసీ మాకు సమాధానమిచ్చారు. దాడులకు దిగిన వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ ను ఎందుకు అరెస్టు చేయలేదని అడిగాం. అధికారులు వైకాపా నేతల ఆదేశాల మేరకు కాకుండా చట్ట ప్రకారం పనిచేయాలి అన్నారు. ఇక బోండా ఉమా మాట్లాడుతూ… రాష్ట్రంలో వైకాపా నేతలు అధికార దుర్వినియోగం చేస్తోన్న వైనాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. శ్రీకాకుళం లో వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఎస్ఈసీని అడిగాం. గతంలో మేమిచ్చిన ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం అన్నారు. అలాగే అచ్చెన్న కేసు విషయమై దర్యాప్తు కోసం స్పెషల్ ఆఫీసర్ ను శ్రీకాకుళం వెళ్లమని ఆదేశించినట్లు ఎస్ఈసీ మాకు తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ ,సీఐ లపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ ని కోరాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు. చూడాలి మరి దీని పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts