telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా టెస్టులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

high court on new building in telangana

కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.కేవలం గాంధీ, నిమ్స్‌లోనే కరోనా పరీక్షలు చేయించుకోవాలనడం రాజ్యంగ విరుద్ధమని అభిప్రాయపడింది. మంగళవారం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్స్‌లో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు తీర్పును వెలువరించింది.

కరోనా సేవల కోసం ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్స్‌ ఐసీఎంఆర్ కి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకున్న ఆస్పత్రులు, ల్యాబ్స్‌లో వైద్య సిబ్బంది, సదుపాయాలను పరిశీలించి ఐసీఎంఆర్ నోటిఫై చేయాలని స్పష్టం చేసింది. అలా ఐసీఎంఆర్ ఆమోదించిన ఆస్పత్రుల్లోనే కరోనా చికిత్సలకు అనుమతించాలి ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts