telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలి: కన్నా

Kanna laxminarayana

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ వెనకున్న ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని సుప్రీంకోర్టు ఈ రోజు వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు.

ఒకే విషయంలో ఇంకెన్ని సార్లు కోర్టుతో మొట్టికాయలు తింటారని ఆయన ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేశ్ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకోవాలని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలని కన్నా హితవు పలికారు.

Related posts