ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శనివారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదులో వివరించారు. పోలీస్ అధికారుల పదోన్నతుల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌ను కలిసినవారిలో జగన్‌తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
లేనిది ఉన్నట్టు సృష్టించడం టీడీపీ నైజం: మంత్రి బుగ్గన