telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

పెళ్లి కొడుకు ఇచ్చిన పార్టీలో గొడవ… ఆ తర్వాత..?

marriage

ఉత్తరప్రదేశ్‌లో దారుణమైన ఘనట జరిగింది. పెళ్లి అయిన రోజే దారుణ హత్యకు గురయ్యాడు పెళ్లి కొడుకు.. పెళ్లి తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే తన స్నేహితులకు పార్టీ ఇచ్చిడు వరుడు.. అయితే, అక్కడ జరిగిన గొడవ.. చిలికిచిలికి గాలివాన తరహాలో పెద్దదై.. చివరకు పెళ్లి కొడుకునే హత్య చేసేంత వరకు వెళ్లింది.. జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అలీఘర్‌కు సమీపంలోని పలిముకిమ్‌పూర్‌కు చెందిన బబ్లూ అనే యువకుడికి వివాహం జరిగింది.. పెళ్లి జరిగిన సోమవారం రోజే… స్నేహితులను కలిశాడు.. అప్పటికే ఫుల్‌గా మందుకొట్టిన స్నేహితులు.. మరింత మద్యం కావాలని బబ్లూను అడిగారు.. అయితే, ఇక చాలని వారిని సముదాయించే ప్రయత్నం చేశాడు పెళ్లి కొడుకు.. అయినా వారు వినలేదు.. మద్యం విషయంలో స్నేహితుల మధ్య వాగ్వాదం జరిగింది.. మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు.. పెళ్లి కొడుకుపై కత్తితో దాడి చేశాడు.. పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు.. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో చనిపోయినట్టు వైద్యులు తేల్చారు.. ఇలా.. పెళ్లి అయిన గంటల వ్యవధిలోనే పెళ్లి కొడుకు చనిపోవడం.. రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts