telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన యూకే…

corona vaccine

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే యూఎస్ లో కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ ను తయారు చేసింది.  ఈ వ్యాక్సిన్ ను వివిధ దేశాల్లో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.  ట్రయల్స్ మంచి ఫలితాలను ఇస్తున్నది.  వ్యాక్సిన్ ను రిలీజ్ చేసేందుకు అనుమతులు ఇవ్వాలని ఇప్పటికే ఫైజర్ సంస్థ అమెరికన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.  దీనిపై అమెరికా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నది.  ఇక ఇదిలా ఉంటె, ఫైజర్ కంపెనీ వ్యాక్సిన్ కు యూకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది.  యూకే లో ఆమోదం పొందటంతో అక్కడ వ్యాక్సిన్ ను అత్యవసరంగా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఫైజర్ ఏర్పాట్లు చేస్తున్నది  ఈనెల 7 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ను  అందుబాటులోకి తీసుకొస్తున్నారు.  ముందుగా 80ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ఇవ్వబోతున్నారు.  ఆ తరువాత కరోనా వారియర్స్ కు, అనంతరం మిగతా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. యూకేలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.  రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చూడాలి మరి ఇది ఎంత వరకు పనిచేస్తుంది అనేది.

Related posts