telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఇమ్రాన్ ఖాన్ సిగ్గుపడిన వేళ !

shied pak pm imran khan

అవును నిజంగానే పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ సిగ్గుపడ్డాడు. మన వింగ్ కమేండర్ అభినందన వర్ధమాన్ ను విడుదల చేస్తున్నట్టు పాకిస్తాన్ ఉభయ సభల్లో ప్రకటించాడు. ఈ ప్రకటనపై సభ్యులంతా హర్షం వ్యక్తం చేశారు . ఇమ్రాన్ ప్రకటించిన విధంగానే అభినందను విడుదల చేశాడు. దీనితో పాకిస్తాన్ ప్రజల్లో కూడా ఇమ్రాన్ పట్ల గౌరవం పెరిగింది . ఇదంతా బాగానే ఉంది. ఆ తరువాత రోజు పార్లమెంట్లో ఓ మంత్రి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పేరును నోబెల్ పీస్ అవార్డు కమిటీ పరిశీలించాలని తీర్మానం ప్రవేశపెట్టాడు.

ఈ తీర్మానాన్ని సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పాకిస్తాన్ తో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఈ వార్తను ప్రకటించాయి. ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ బహుమతి. శాంతి కోసం కృషి చేసిన నాయకులకు ఈ అవార్డు ప్రకటిస్తారు. 1901వ సంవత్సరంలో స్వీడన్ దేశస్తుడు అల్ఫ్రెడ్ నోబెల్ దీనిని ప్రారంభించాడు. అయితే సభలో వున్న ఇమ్రాన్ అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఏమిజరిగిందో తెలియదు.

మరుసటిరోజు ఈ అవార్డుకు తానూ అర్హుడిని కాదని ప్రకటించాడు. అంతేకాదు కాశ్మీర్ సమస్యను ఎవరైతే పరిష్కరిస్తారో వారికి ఇవ్వాలని తద్వారా భారత ఉపఖండంలో శాంతి నెలకొంటుందని చెప్పాడు. ఇమ్రాన్ ఈ విషయంలో ఆలస్యంగా స్పందించినా … ఉన్నది ఒప్పుకున్నాడని అందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts