telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు !

Talasani Trs

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీలో నిన్న ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సారానికి గానూ తెలంగాణ బడ్జెట్‌ విలువ రూ. 2,30,825.96 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు కాగా.. ఆర్థిక లోటు అంచనా రూ. 45, 509.60 కోట్లు, మూల‌ధ‌న వ్య‌యం రూ. 29.046.77 కోట్లు అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే.. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు.  తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉందని మంత్రి తలసాని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమ పాళ్ళలో ఉందని.. వ్యవసాయం, అనుబంధ విభాగాలకు బడ్జెట్ లో పెద్ద పీట లభించిందని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ కు బడ్జెట్ లో ప్రాధాన్యత లభించిందని.. ఒకపుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ.. ఇప్పుడు 60 కోట్ల రూపాయల లాభంలో ఉందంటే అది సీఎం కెసిఆర్ విధానాల ఫలితమేనని స్పష్టం చేశారు. విజయ ఔట్ లెట్ల సంఖ్యను వెయ్యికి పెంచుతున్నామని..గొర్రెల పంపీణీకి బడ్జెట్ లో నిధులు కేటాయించామన్నారు. బర్రెలను సబ్సిడీ రేట్ల పై పంపిణీ చేసేందుకు ప్రాధాన్యతనిస్తున్నామని.. కళ్లుండి చూడలేని విపక్షాలు బడ్జెట్ ను విమర్శిస్తున్నాయని ఫైర్‌ అయ్యారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్ఎస్ గెలవబోతుందని.. ప్రభుత్వ పని తీరుకు ప్రజల ఆదరణ లభిస్తోందన్నారు. విద్యావంతులు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీగా నమోదు కావడం విచారకరమని అన్నారు.

Related posts