telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫేస్ బుక్ హ్యాక్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి

shobhana

దక్షణాది సీనియర్ నటి, క్లాసికల్ డాన్సర్ శోభన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టు చెప్పింది. లాక్ డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ డాన్స్ ద్వారా ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవచ్చో తెలియజేస్తూ పలు వీడియోను విడుదల చేస్తున్న శోభన ఫేస్ బుక్‌ను హ్యాక్‌ చేశారంటూ ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది శోభన. ఈ సందర్భంగా తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది శోభన. ‘డియర్ ఫ్రెండ్స్.. నా వ్యక్తిగత ఫేస్ బుక్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.. దాన్ని పోలీసుల సాయంతో తిరిగి క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేస్ బుక్ ఖాతాని తిరిగి పొందిన తరువాత మరింత యాక్టివ్‌గా ఉంటాము.. ధన్యవాదాలు’ అంటూ పోస్ట్ పెట్టింది శోభన. భరతనాట్యం కళాకారిణిగా తన అద్భుతమైన ప్రతిభతో పలు ప్రదర్శనలు ఇచ్చిన శోభన.. నాగార్జున విక్రమ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అగ్రహీరోలందరితోనూ నటించింది. చంద్రముఖి చిత్రానికి మూలమైన మలయాళ చిత్రం మణిచిత్రతాళులో అద్భుతంగా నటించి పలు అవార్డుల్ని పొందింది శోభన.

 

View this post on Instagram

 

To my Instagram followers!! It will be great if you can share the message Thanks shobana

A post shared by Shobana Chandrakumar (@shobana_danseuse) on

Related posts