telugu navyamedia
సినిమా వార్తలు

నువ్వు ఎవరు అనేది నువ్వు వెనకేసుకున్న ఆస్తిలోనో..

సూపర్​స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తమిళ మూవీ ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. యాక్షన్ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.

ఎమోషన్ కూడిన యాక్షన్ ఎంటర్టైనర్‌‌‌‌గా పెద్ద‌న్న‌ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఇప్పటికే పెద్దన్న మోషన్ పోస్టర్ విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

Annaatthe Release Date, Star Cast, Budget, Trailer & More - JanBharat Times

‘నువ్వు ఎవరు అనేది నువ్వు వెనకేసుకున్న ఆస్తిలోనో.. లేదా నీ చుట్టూ ఉన్నవాళ్లకు నీ మీద ఉన్న భయంలోనో లేదు’.. నువ్వు చేసే చర్యల్లోనూ.. మాట్లాడే మాటాల్లోనూ ఉంటుంది. ఇది వేదవాక్కు’ అంటూ రజనీ చెప్పే డైలాగుతో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. పేరు వీర‌న్న‌..ఊరు రాజోలు..చుట్టుప్ర‌క్క గ్రామాల‌కు పంచాయితీ పెద్ద‌ అన్న డైలాగ్ అదిరింది.

రజనీకాంత్ అభిమానులు కోరుకునే యాక్షన్, కామెడీ.. ఇలా అన్ని అంశాలతో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం సమకూర్చాడు.

Annaatthe trailer out Rajinikanth Gives Eye Feast to Fans with His Action - Sakshi

ఈ చిత్రంలో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ న‌టిస్తుండ‌గా.. మీనా, ఖుష్బూ, జ‌గ‌ప‌తిబాబు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది.

Related posts