telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనా ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది.. చైనాపై ట్రంప్ మరోసారి ఫైర్

trump usa

అమెరికాలో కరోనా వైరస్‌ ను కట్టడి చేయలేక అగ్రరాజ్యం నానా ఇబ్బందులకు గురవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పుట్టినిల్లు చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మండిపడ్డారు. కరోనా విజృంభణ ప్రపంచవ్యాప్తంగా అధికమైందన్నారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ వైరస్‌ ఎంతో నష్టాన్ని తీసుకొచ్చిందన్నారు.

ప్రస్తుతం చైనా మీద తనకున్న కోపం అంతకంతకు పెరుగుతోందని చెప్పారు. కాగా, అమెరికాలో కరోనా వ్యాప్తిని అదుపు చేసే పరిస్థితులు లేకపోవడంతో అక్కడి వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా నియంత్రణ సాధించలేమని అమెరికా‌ వైద్యులు ట్రంప్‌కు తెలిపారు. తన దేశంలో కరోనాను వూహాన్ దాటకుండా చేయగలిగిన చైనా, దేశాన్ని మాత్రం దాటించి ప్రపంచానికి ఎలా వ్యాప్తి చేసిందని ట్రంప్ మొదటి నుంచి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.

Related posts