telugu navyamedia
సినిమా వార్తలు

“మహానటి” దర్శకుడి మరో భారీ ప్రాజెక్ట్

Nag

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ గ‌త ఏడాది సావిత్రి జీవిత నేప‌థ్యంలో “మ‌హాన‌టి” అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో భారీ విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లతో పాటు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళు రాబ‌ట్టింది. చైనాలోని షాంగై లో ఈ చిత్రాన్ని ప్ర‌ద‌ర్శించారు. షాంగైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌యిన తొలి ఇండియ‌న్ సినిమాగా “మ‌హాన‌టి” అరుదైన ఘ‌న‌త సాధించింది. ఇక ఇదే సంస్థ నుండి ఇటీవల “మ‌హ‌ర్షి” చిత్రం కూడా విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. ఇక త్వ‌ర‌లో నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పెద్ద ప్రాజెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు అనౌన్స్ చేసింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ‌. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యేందుకు విజువ‌ల్ ఆర్టిస్ట్స్‌, డిజైన‌ర్స్‌, రైట‌ర్స్ కావాల‌ని అన్నారు. సెప్టెంబ‌ర్‌లో మా సాహ‌సయాత్ర ప్రారంభం అవుతుంది. మీ వివ‌రాల‌ని ఈ మెయిల్ ఐడీకి [email protected] పంపండి అంటూ ప్రకటన విడుదల చేశారు.

Related posts