telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరోసారి ప్రభాస్ ద్విపాత్రాభినయం ?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో “రాధే శ్యామ్” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘రాధే శ్యామ్’ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా లో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.దాంతో ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే గత రికార్డులను తిరగరాసేలా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఈ వార్త నిజమైతే ప్రభాస్ బిల్లా, బాహుబలి సినిమాల తర్వాత డ్యూయల్ రోల్ ల్లో నటిస్తున్న సినిమా ఇదే అవుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో చూడాలి

Related posts