telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో కీలక అంశాలు ఇవే…!

chandrababu tdp

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసింది. ఏపీ సీఆర్డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ సీఎం చంద్రబాబు పై సీఐడీ కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలోనే 41crpc కింద విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ చంద్రబాబు నివాసానికి సీఐడీ అధికారులు వెళ్లారు. ఇది ఇలా ఉండగా… చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో ఏముంది.. ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులో కీలక అంశాలు ఉన్నాయి.

ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కి సహకరించాలి

ఇన్వెస్టిగేషన్ లో డైరెక్ట్, ఇండైరెక్ట్ గా కేసు విచారణలో ఇన్వాల్వ్ అవ్వకూడదు

సాక్ష్యులను , ఫిర్యాదు దారులను బెదిరించకూడదు

ఈనెల 23 న 11 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలోని CID ఆఫీస్ లో విచారణకు హాజరు కావాలి

41 నోటీసు కింద విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని నోటీసులో పేర్కొంది సీఐడీ.

Related posts