కొన్ని రహస్యంగా ఎందుకు ఉంచాలి.. అనేదానికి ఇప్పటికైనా సమాధానం దొరికిందో లేదో కానీ, మితిమీరినది ఏదైనా వెర్రి చేష్టలకే దారితీస్తుంది. ఈ ప్రభావం ఎక్కువగా ఉండేది యువత మీద, దానివలన వాళ్ళు కూడా మితిమీరిన కోరికలతో హద్దులు దాటేస్తున్నారు. ఎక్కడ తమకు కాస్త ఏకాంతం దొరికినా తమ కోరికలు తీర్చుకోడానికి వెనకాడటంలేదు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో పార్కులు ప్రేమికుల విలాసాలకు అడ్డాలుగా మారిపోగా.. ఇటీవలే మొదలైన మెట్రో ను కూడా వారి స్థావరం చేసుకోవడం విశేషం. హైదరాబాద్‌లోని మెట్రో స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ఏర్పాటు చేసిన లిఫ్టులు ప్రేమికులకు అడ్డాగా మారుతున్నాయి. నాలుగు వైపులా మూసుకుని ఉండే ఈ ఎలివేటర్లు ప్రేమికులకు హాట్ స్పాట్‌గా మారాయి. నిత్యం రద్దీగా ఉండే నగరంలో కాసింత ఏకాంతం కోరుకునే ప్రేమికులకు మెట్రో లిఫ్ట్‌లు ఎడారిలో ఒయాసిస్సులా కనిపిస్తున్నాయి.
అయితే ఈ లిఫ్ట్‌లలో సీసీటీవీలు ఉన్నాయన్న సంగతిని గుర్తించని ప్రేమికులు ఆ కాస్త సమయంలోనే ముద్దు ముచ్చట తీర్చుకుంటున్నారు. ఇటీవల ఈ సీసీటీవీ ఫుటేజీలను గమనించిన సిబ్బంది అందులోని దృశ్యాలు చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే వాటిని పోలీసులకు అందించారు. లిఫ్ట్‌లలో అధర చుంబనాలు కానిచ్చేస్తున్న వారంతా ఇంటర్, డిగ్రీ చదివే వారు కావడం గమనార్హం. ఇప్పుడీ దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.
ప్రజల జీవితాలతో “కేసీఆర్ అండ్ కో” ఆడుకుంటున్నారు: విజయశాంతి