సంపూర్ణ ఆహారం అనగానే మనకు గుర్తుకు వచ్చేది పాలు. మరో ఆ పాలలో కూడా నేడు ఎన్నిరకాలో.. ఎంత కల్తీనో చెప్పాల్సిన పనేలేదు. మరి ఇక పాలకోసం ప్యాకెట్లే దిక్కు.. అన్నవారు మాత్రం చాలా జాగర్తగా ఉండాలిసుమా. మనకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే ఆహారాల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయని, పాలను రోజూ తాగడం వల్ల మన శరీరానికి చక్కని పోషణ అందుతుంది అని ఇష్టానికి తాగేయకండి. కొన్ని జాగర్తలు పాటించండి. ముఖ్యంగా ప్యాకెట్ పాలను మరిగించరాదు… ఎందుకో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!
* పాలుతాగితే పిల్లలు త్వరగా సరైన రీతిలో ఎదుగుతారు. అందుకే పోషకాహారం కావాల్సిన వారందరికీ పాలను ప్రధాన ఆహారంగా ఇస్తున్నాం. పాలను తాగాలంటే వాటిని ఎవరైనా మరిగించాల్సిందే. దాని తో పాలలో ఉండే హానికరమైన బాక్టీరియా నశిస్తుంది. కానీ నేటి తరుణంలో చాలా మంది ప్యాకెట్ పాలను కూడా మరిగిస్తున్నారు. నిజానికి అలా చేయరాదు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే.
* ప్యాకెట్ పాలను మరిగించాల్సిన పనిలేదు. సింపుల్‌గా కొంచెం వేడి చేసుకుని ఉపయోగిస్తే చాలు. ఇది తెలియని చాలా మంది వాటిని బాగా మరిగిస్తున్నారు.
**అసలు ప్యాకెట్ పాలను మరిగించాల్సిన అవసరం ఎందుకు లేదో ఇప్పుడు తెలుసుకుందాం…!
* సాధారణంగా ఏ డెయిరీలో అయినా పాలను అధిక ఉష్ణోగ్రతకు మరిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్‌హీట్ టెంపరేచర్‌కు పాలను మరిగించి వెంటనే 15 సెకండ్లలోనే చల్లారుస్తారు. ఇలా చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీని వల్ల పాలలో ఉండే హానికారక సాల్మొనెల్లా బాక్టీరియా తొలగిపోతుంది. ఇలా ఒకసారి మరిగించాక ఆ పాలను ప్యాక్ చేస్తారు. అనంతరం వాటిని మనం మళ్లీ మరిగిస్తే వాటిల్లో ఉండే పోషకాలు నశిస్తాయి. కనుక ప్యాకెట్ పాలను మళ్లీ మరిగించాల్సిన పనిలేదు. కాకపోతే చల్లగా ఉంటాయనుకుంటే కొద్దిగా వేడి చేసి తాగవచ్చు. కానీ మరిగించరాదు.
* ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారుల నుంచి పాలను కొనేవారు మాత్రం ఆ పాలను ఖచ్చితంగా మరిగించాలి. దాని తో ఆ పాలల్లో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా నశిస్తుంది. అప్పుడు ఆ పాలను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు.
ఇకపై ఎవరూ ప్యాకెట్ పాలను మరిగించకండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. తద్వారా ఎంతో విలువైన ఇంధనాన్ని (వంట గ్యాస్ లేదా కిరోసిన్.. ఎవరు ఏది ఉపయోగిస్తారో అది) కూడా ఆదా చేయవచ్చు.