telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“హిట్” ఫస్ట్ డే కలెక్షన్స్… హిట్టా ఫట్టా ?

HIT

పోస్టర్ బ్యానర్‌తో నిర్మాతగా మారిన నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్’. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రం శుక్రవారం నాడు విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది. శైలేష్ కొలను ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం కాగా..‘చి.ల.సౌ ఫేమ్ రుహాని శర్మ హీరోయిన్‌గా నటించింది. మంచి బజ్‌తో థియేటర్స్‌కి వచ్చిన హిట్ మూవీ తొలిరోజు మంచి కలెక్షన్లే రాబట్టింది. ఈ నగరానికి ఏమైంది?, ఫలక్ నుమాదాస్ చిత్రాలతో నటుడిగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాకపోవడంతో ఈ చిత్రం తొలిరోజు ఓ మాదిరిగానే ఉన్నాయి. తొలిరోజు అన్ని ఏరియాలలోనూ కలిపి రూ. 1.29 కోట్లు రాబట్టింది.

నైజాం- 0.66 కోట్లు
సీడెడ్- 0.13 కోట్లు
యూఏ- 0.12 కోట్లు
గుంటూరు- 0.15 కోట్లు
ఈస్ట్ గోదావరి- 0.06 కోట్లు
వెస్ట్ గోదావారి- 0.05 కోట్లు
క్రిష్ణా – 0.08 కోట్లు
నెల్లూరు- 0.04 కోట్లు
మొత్తం – 1.29 కోట్లు

ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ చెప్పినంత రేంజ్‌లో ఈ సినిమా లేదు కాని.. సినిమా చూసిన ప్రేక్షకుల్ని ‘హిట్’ డిజప్పాయింట్ చేయదు అని మాత్రం చెప్పొచ్చు. కాగా తొలిరోజు ఓ మాదిరి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 4.40 కోట్ల మేరకు జరిగింది.

Related posts