ఆనాడు వరల్డ్ కప్ లో పసికూనగా బరిలోకి దిగిన భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. అందరూ విండీస్ జట్టుదే గెలుపని అన్నారు. టాస్ గెలిచిన క్లైవ్ లాయిడ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. విండీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. దీంతో విండీస్‌కు భారత్ 184 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ణయించగలిగింది. మూడో టైటిల్ కూడా విండీస్‌కే అని అందరూ అనుకునారు. విండీస్ బ్యాటింగ్ లో భీకర ఓపెనర్లు అయిన గ్రీనిడ్జ్ (1), హేన్స్ (13)ను తక్కువ పరుగులకే కట్టడి చేశారు. అయినా అప్పటికీ ఫేవరేట్ విండీసే. దీనికి కారణం ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్ రిచర్డ్‌సన్ క్రీజ్‌లో ఉన్నాడు.
మదన్‌లాల్ బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా అతడు భారీ షాట్ కొట్టాడు. కపిల్ వెనక్కి పరిగెడుతూ బౌండరీలైన్ సమీపంలో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఒక్కసారిగా స్టేడియమంతా వందేమాతరం నినాదాలతో మార్మోగింది. ఇక భారత్ బౌలర్లు జోరు తగ్గకుండా… నిప్పులు చెరిగే బంతులు విసురుతుంటే వెస్టిండీస్ జట్టు పేకమేడలా కూలిపోయింది. లార్డ్స్ మైదానంలో టీమిండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచకప్ అందుకున్న తొలి భారత కెప్టెన్‌గా కపిల్‌దేవ్ రికార్డు సృష్టించాడు. ఆ మధుర క్షణానికి నేడు సరిగ్గా 36 ఏళ్లు(1983 లో ప్రపంచ కప్ తీపి జ్ఞాపకాలు).