telugu navyamedia
వార్తలు సామాజిక

కరోనా మరణాల కన్నా ఆకలి చావులే ఎక్కువ: ఇన్ఫోసిస్‌ నారాయణ మూర్తి

Narayana murthy Infosys

దేశంలో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను ఇలాగే కొనసాగిస్తే కొవిడ్‌-19 మరణాల కంటే ఆకలి చావులే ఎక్కువగా ఉంటాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తెలిపారు. కరోనా నుంచి ప్రజలను రక్షించే చర్యలు తీసుకుంటూనే, పలు సంస్థలను తిరిగి తెరవాలని ఆయన సూచించారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారు మళ్లీ తిరిగి వారి వారి పనుల్లోకి వెళ్లాలని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో ఏడాదికి దాదాపు 9 మిలియన్ల మంది పలు కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో వాతావరణ కాలుష్యం కారణంగా మృతి చెందేవారు 1/4 శాతం మంది అని ఆయన చెప్పారు. ‘దేశంలో ఏడాదికి 90 లక్షల మంది వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ, కరోనా నేపథ్యంలో గత రెండు నెలల్లో సుమారు 1,000 మంది మాత్రమే చనిపోయారు. ఇతర అభివృద్ధి చెందిన దేశాల కన్నా ఇది తక్కువని ఆయన వివరించారు.

Related posts