telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కేంద్రం ఇచ్చేది 500 టన్నుల ఆక్సీజన్ మాత్రమే : ఆళ్ల నాని

కేంద్రం 500 టన్నుల ఆక్సీజన్ మాత్రమే రాష్ట్రానికి ఇస్తోంది అని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఆక్సిజన్ కొరత, పడకల కొరత రాకుండా ప్రణాళికలు రచిస్తున్నాం. కోవిడ్ కేర్ సెంటర్లు పెంచితే ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది. జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేస్తున్నం. స్విమ్స్, రుయా ఆసుపత్రులలో సమస్యలు లేకుండా చేస్తాం. వాక్సినేషన్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. కేంద్రం పంపిస్తున్న వాక్సిన్ లు అదే రోజు ప్రజలకు అందేలా చేస్తున్నాం. అన్ని ప్రైవేట్ ఆసుపత్రులలో 50శాతం పడకలు ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటున్నాం. ఆక్సిజన్ అందుబాటులో లేకనే కోవిడ్ కేర్ సెంటర్లు కి వెళ్లకుండా ఆసుపత్రులకు వస్తున్నారు. కోవిడ్ కేర్ సెంటర్ లలో ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకువచ్చి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గిస్తాం అని మంత్రి పేర్కొన్నారు. అయితే ఏపీలో రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే.

Related posts