ప్రపంచ వ్యాప్తంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎంత పాపులరో తెలిసిందే. అన్ని దేశాల అధ్యక్షులు దేశం అభివృద్ధి కోసం వినూత్న నిర్ణయాలు తీసుకుని గుర్తింపు తెచ్చుకుంటే కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయాలు తీసుకుని వార్తల్లో నిలుస్తారు. దాంతో కిమ్ ఓ మూర్కుడు అని తెగ పాపులర్. కరోనా విజృంభన సమయంలో దేశంలోకి కరోనా సోకిన వాళ్లు వస్తే వాళ్ళని డైరెక్ట్ గా షూట్ చేసి చంపాలని కిమ్ ఆదేశాలు ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఇతర దేశాలన్నీ కరోనా ను ఎలా జయించాలని ప్రయోగాలు చేస్తుంటే కిమ్ మాత్రం పక్క దేశాలపై అణుబాంబుల ప్రయోగాలు చేయడానికి సిద్ధమయ్యాడు. పొరుగు దేశాలపై కూడా కిమ్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూ వార్తల్లో నిలుస్తారు. ఏకంగా అగ్ర దేశ అధ్యక్షుడు ట్రంప్ కే కిమ్ చమటలు పుట్టించాడంటే కిమ్ ధైర్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా కిమ్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర కొరియాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. కిమ్ తీసుకున్న నిర్ణయం పై ఉత్తరకొరియా పీపుల్స్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినట్టు అక్కడి మీడియా పేర్కొంది. ఈ మేరకు థియేటర్లు, మాల్స్, రాజకీయ కేంద్రాలు, విద్యా కేంద్రాలు, వైద్య కేంద్రాల్లో ధూమపానాన్ని నిషేధించారు. అయితే కిమ్ ధూమపానం నిషేధిస్తూ ఓ మంచి పని చేసినప్పటికీ ఈ సారి కూడా ఒక సంచలన నిర్ణయమే తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే కిమ్ ఒక చైన్స్ స్మోకర్ అయినప్పటికీ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించారు. ఇక ఇప్పుడు ఆయన కూడా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం మానేస్తారా…లేదంటే కేవలం ఇది పౌరులకు మాత్రమే వర్తిస్తుందా అన్నది చూడాలి.
previous post
కమిటీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం: కన్నా