టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “మీరు పుట్టిన 1950లో మీ ఊరొక్కటే కాదు. దేశంలోని 90% గ్రామాలకు కరెంటు లేదు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు గదా, మీ కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఇన్నేళ్లలో గుక్కెడు తాగు నీరు అందించలేక పోయారే. దాన్నేమనాలి? వ్యవసాయం దండగని తేల్చారు కాబట్టి సాగునీరిచ్చే ఉద్దేశం లేదనుకుంటాం.” అంటూ ఫైర్ అయ్యారు. “ఆక్రమణలను కూల్చేస్తే… విధ్వంసం.
వందల కోట్ల స్కాములకు పాల్పడిన వారిని అరెస్టు చేస్తే…బలహీన వర్గాలపై కక్ష సాధింపు. ఇన్ సైడర్ ట్రేడింగుపై కేసులు నమోదు చేస్తే… వేధింపులు. ఏంచేయకుండా వదిలేస్తే… నిప్పును కాబట్టే కేసు కూడా పెట్టలేకపోయారని ఎగతాళికి దిగుతాడు బాబు.” అంటూ మరో ట్వీట్ చేశారు. కాగా “ఎన్టీఆర్ కన్నా పెద్ద వెన్నుపోటును ఎర్రన్నాయుడుకు పొడిచాడు చంద్రబాబు. అతను ఢిల్లీలో ఎక్కడ ఎదిగిపోతాడోనని ఎక్కడిక్కడ బ్రేకులు వేశాడు, అవమానించాడు.జగన్ గారిపై తప్పుడు కేసులు పెట్టాలంటూ ఆయన్ను వేధించాడు. వైఎస్,జగన్ గారి లాంటి వారు సీఎం ఉంటే అంబులెన్స్ లో ఆక్సిజన్ అందక చనిపోయేవాడా?” అంటూ అంతకుముందు ట్వీట్లో పేర్కొన్నారు.
previous post