telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్ట్

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ మూవీతో రీ ఎంట్రీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ పూర్తయింది. పవన్‌ 27వ సినిమా క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. పవన్‌ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది సెప్టెంబర్‌ 2న ప్రీలుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా.. ఆ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. హిస్టారికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతుంది ఈ మూవీ. ఈ సినిమాలో పవన్‌ హరిహర వీరమల్లు పాత్రలో కనిపించనున్నారని టాక్‌.  అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక పుకార్లు వినిపించాయి. విరూపాక్ష, హరహర వీరమల్లు, ఓం శివమ్ వంటి అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. వీటిపై క్లారిటీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ మేకర్స్ ఎట్టకేలకు సినిమా టైటిల్‌పై క్లారిటీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను మహాశివరాత్రి సందర్భంగా మార్చి11 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా 17వ శతాబ్ద నేపథ్యంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా ఈ సినిమా పవన్ కెరీర్‌లో చేస్తున్న మొట్టమొదటి పిరియాడికల్ సినిమా. ఈ సినిమా కోసం పవన్ సరికొత్త లుక్స్‌లో కనిపించనున్నారు.

Related posts