telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్‌కి ఇప్పుడే కాదు ఎప్పుడూ వెళ్లను : విష్ణుప్రియ

Vishnu priya

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కి రంగం సిద్ధమైంది. ఆగస్టు ఆఖరి వారంలో షో ప్రారంభమవుతుందని సమాచారం. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సెట్ సిద్ధం చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ 4లో పాల్గొనే కంటెస్టెంట్లకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు జాబితాలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ తరుణ్, శ్రద్ధా దాస్, సునయన ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. విష్ణుప్రియ కూడా పాల్గొంటున్నారని రూమర్లు వచ్చాయి. ఇప్పటికే తరుణ్, శ్రద్ధా దాస్, సునయన స్పందించారు. ఈ రూమర్లను కొట్టిపాడేశారు. ఇప్పుడు విష్ణుప్రియ కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ మేరకు తన రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. ‘‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు.. ముఖ్యంగా బిగ్ బాస్‌కి. ఇప్పుడే కాదు ఎప్పుడూ వెళ్లను. ఈ విషయంలో నన్ను నమ్మండి. కాబట్టి, నన్ను ఇష్టపడేవాళ్లు అందరూ రిలాక్స్‌గా ఉండండి. అందరూ సంతోషంగా ఉండండి’’ అని తన ఇన్‌స్టా స్టోరీలో విష్ణుప్రియ పేర్కొన్నారు.

Related posts