telugu navyamedia
Uncategorized ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల సమావేశం..వీటిపైనే చర్చ

రెండు తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారుల సమావేశం మరికాసేపట్లో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆఫీస్ లో జరుగనుంది. అయితే…పోలవరం ప్రాజెక్టు వ్యయం, పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాద్రి కి ముంపు ఉంది అంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2013 -2014 అంచనాల మేరకు 36 లక్షల క్యూసెక్ ల బ్యాక్ వాటర్ ఉంటే సుమారు 72 గ్రామాలు ముంపు గురి అయ్యే అవకాశం ఉందన్న తెలంగాణ..పోలవరం నీటి నిల్వ 50 లక్షల క్యూసెక్ లకు పెంచడంతో 100కు పైగా గ్రామాలు మునిగి పోతాయని వెల్లడించింది. అంతేకాదు.. పలు కేంద్ర ప్రభుత్వ కంపెనీలు మునిగి పోతాయని లేఖలో తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పష్టం చేసింది. అటు పోలవరం నిర్మాణంకు కేంద్రం ఇవ్వవలసిన నిధులపై మరోసారి చర్చకు సిద్ధమైంది ఏపీ. ఇక ఈ సమావేశానికి కేంద్ర జల శక్తి శాఖ ceo చంద్ర శేఖర్ అయ్యర్, తెలంగాణ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్, ఏపీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్య నాథ్ దాస్, కేంద్ర జల శక్తి శాఖ జాయింట్ సెక్రటరీ జగన్ మోహన్ గుప్తా హాజరుకానున్నారు.

Related posts