‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంలో హనుమంతుడు ఎవరికోసం సంజీవనిని తీసుకువచ్చారని అమితాబ్ బచ్చన్ అడ్డగ్గా దానికి సోనాక్షి సిన్హా సమాధానం చెప్పలేకపోయింది. సోషల్ మీడియాలో సోనాక్షిని నెటిజన్లు ఓ ఆట ఆడుకున్న సంగతి తెలిసిందే. ఈ సంఘటనను ఎత్తి చూపుతూనే ముఖేశ్ ఖన్నా ప్రత్యక్షంగా సోనాక్షిపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే తన కూతురిపై అనుచిత వ్యాఖ్యాలు చేసినందుకు బాలీవుడ్ షాట్ గన్ శత్రుఘ్న సిన్హా నటుడు ముకేశ్ ఖన్నాపై విరుచుకుపడ్డారు. దీంతో శత్రుఘ్న సిన్హా తాజాగా ఓ వెబ్‌సైట్‌కిచ్చిన ఇంటర్వూలో ముకేశ్ పేరు ఎత్తకుండానే పరోక్షంగా విరుచుకుపడ్డారు. “రామాయణంపై అడిగిన ఒక ప్రశ్నకు సోనాక్షి సమాధానం చెప్పకపోవడం ఎవరికో సమస్యగా ఉందని నేను అనుకుంటున్నాను. ముందుగా ఆ వ్యక్తికి రామాయణంపై నిపుణుడిలా వ్యవహరించడానికి ఏ అర్హత ఉంది. హిందూ మతం సంరక్షకుడిగా అతడిని ఎవరు నియమించారు?.. సోనాక్షితో సహా నా ముగ్గురు పిల్లలకు తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. సోనాక్షి కెరీర్‌ను నేను ప్రారంభించాల్సిన అవసరం లేదు. తన సొంత కాళ్లపై నిలబడి స్టార్ అయ్యింది. తనలాంటి కుమార్తె ఉన్నందుకు ఏ తండ్రి అయినా గొప్పగా ఫీల్ అవుతాడు. రామాయణ ప్రశ్నకు సోనాక్షి సమాధానం ఇవ్వకపోవడం ఆమెను హిందువు కాదని చెప్పలేదు. ఆమెకు ఎవరి నుంచి అర్హత పత్రం అవసరం లేదు…” అంటూ ముకేశ్‌పై ఘాటు విమర్శలు చేశారు.
previous post