telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ : కొత్త జిల్లాల ఏర్పాటు మరింత వేగవంతం..

ap

కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా వరుస భేటీలు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసింది. జిల్లాల్లోనూ కలెక్టర్ల నేతృత్వంలో భేటీలు నిర్వహిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే సమావేశం నిర్వహించారు డీజీపీ సవాంగ్. భౌగోళిక, ఆర్ధిక, సహజ వనరుల లభ్యతను బేరీజు వేసుకుని కొత్త జిల్లాల ఏర్పాటులో కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. ఆదాయ వనరులతో కూడిన కొత్త జిల్లాల ఏర్పాటుకు రోడ్ మ్యాప్ సిద్దం చేస్తోంది ప్రభుత్వం. అందుబాటులో ఉన్న అధికారులు.. ఉద్యోగులు.. సిబ్బందితోనే కొత్త జిల్లాల్లో వ్యవస్థ ఏర్పాటు చేసేలా ప్రణాళికలు చేస్తోంది. అవసరమైన చోట అందుబాటులో ఉన్న ఉద్యోగులనే అప్ గ్రేడ్ చేసి బాధ్యతలు అప్పగించేలా ఏర్పాట్లు చేస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలంటే కొన్ని మండలాలను పునర్ వ్యవస్థీకరించాల్సి వస్తోందనే భావన కూడా ఉంది. వీలైనంత వరకు ప్రభుత్వ సూచనల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు వేగవంతం చేస్తోంది. 26 జిల్లాలకే పరిమితం కావడం కష్టంతో కూడుకున్న వ్యవహరంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ తరహాలో ఏపీలోనూ జిల్లాల సంఖ్య పెరిగే ఛాన్స్ లేకపోలేదని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related posts