సైబర్ టవర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో తవ్వేకొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి. కాశీ విశ్వనాధ్‌తో పాటు అతని స్నేహితుడు కౌశిక్ పబ్బులో ఫుల్లుగా తాగి… తర్వాత తినడానికి కారులో బయల్దేరారు. ఇదే టైమ్‌లో సైబర్ టవర్ సిగ్నల్ దగ్గర రాష్ డ్రైవింగ్‌తో బైక్‌ను ఢీకొట్టారని పోలీసులు చెబుతున్నారు. యాక్సిడెంట్ చేసిన కారు రాయలసీమ ఎమ్మెల్యే కుమారుడిదిగా గుర్తించారు అధికారులు. యాక్సిడెంట్ అయిన వాహనం కాటసాని ఓబుల్‌రెడ్డి పేరుతో ఉండటంతో.. ఆయనకు నోటీసులు పంపనున్నారు అధికారులు. మరోవైపు.. యాక్సిడెంట్ తర్వాత కారును వదిలేసి పరారైన విశ్వనాథ్, కౌశిక్.. ఓయో రూమ్‌లో తలదాచుకున్నట్టు పోలీసులు గుర్తించారు. వారిద్దరిపై గతంలో అబిడ్స్ పీఎస్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు అయ్యి ఉంది. క్లబ్ రోగ్ పబ్ లో మద్యం సేవించి ఆ మత్తులోనే సైబర్ టవర్ చౌరస్తా వద్ద తన బెంజ్ కారు తో సిగ్నల్ జంప్ చేసి బైక్ పై వెళ్తున్న భార్య భర్తల ను కారు తో ఢీ కొట్టాడు కాశీ విశ్వనాథ్. ఆ దంపతుల్లో భర్త గౌతమ్ దేవ్ అక్కడిక్కడే మృతి చెందగా…భార్య శ్వేత కోమ లోకి వెళ్ళింది.
previous post