telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ భారీ విజయం… మమతా బెనర్జీ, ప్రశాంత్ కిశోర్ శుభాకాంక్షలు

Kejriwal

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కేజ్రీవాల్‌ నివాసంలో ఆయనను ప్రశాంత్‌ కిషోర్‌ కలిశారు. ఆప్‌ విజయంలో ప్రశాంత్‌ కిషోర్‌ కీలకపాత్ర పోషించారు. ఆప్‌ మేనిఫెస్టో రూపకల్పనలో ప్రశాంత్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తానికి కిషోర్‌ వ్యూహలు ఆప్‌ గెలుపుకు కీలకంగా పని చేశాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన కేజ్రీవాల్‌కు మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని ప్రజలు తిరస్కరించారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఆమె చెప్పారు. సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీని ప్రజలు తిరస్కరించారని మమత పేర్కొన్నారు.

Related posts