నిర్ణీత పంటల సాగు విధానం అమలు చేసిన ఫలితంగా పత్తిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. 2020 వానాకాలంలో దేశ వ్యాప్తంగా 3.19 కోట్ల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. కోటి నాలుగు లక్షల ఎకరాల్లో పంటను సాగు చేస్తూ మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. 60.52 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. 56.29 లక్షల సాగుతో గుజరాత్ మూడవ రాష్ట్రంలో, 18 లక్షలతో హర్యానా నాలుగవ స్థానంలో ఉన్నాయి. గత ఏడాది వరకు తెలంగాణ రాష్ట్రం పత్తి సాగులో మహారాష్ట్ర, గుజరాత్ తర్వాత మూడో స్థానంలో ఉండేది. 2019 వానాకాలంలో గుజరాత్ లో 65.88 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు కాగా, తెలంగాణలో 54.45 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగయింది. అయితే ఈ ఏడాది పత్తిసాగు చేసిన రైతులను వర్షాలు దెబ్బతిశాయి అనే చెప్పాలి. అధిక వర్షాల కారణంగా పత్తి చాలా వరకు నాశనం అయ్యింది.
previous post
ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం నిరంకుశ వైఖరి: లక్ష్మణ్