telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గూగుల్ లో కొడితే జగన్ కటకటాల చరిత్ర వస్తుంది..!

devineni on power supply

ఏపీ ప్రభుత్వంపై దేవినేని ఉమా మరో సారి ఫైర్ అయ్యారు. గూగుల్ లోకొడితే జగన్ కటకటాల చరిత్ర వస్తుంది గానీ, పోలవరం సమాచారం రాదని అనిల్ గ్రహించాలన్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న అనిల్ ఏది అడిగినా గూగుల్ లో వెతకమంటున్నాడని.. ఆయన చెప్పినట్టే గూగుల్ లో వెతికితే 6093 నంబర్, కటకటాల వెనకున్న జగన్మోహన్ రెడ్డి ఫొటో వచ్చాయని సెటైర్ వేశారు. మార్చి 2020లో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రజలవనరుల మంత్రి సమాధానం చెబుతూ, పోలవరం ప్రాజెక్టు పనులు 69.54శాతం పూర్తయినట్లు చెప్పారని.. వైసీపీప్రభుత్వం వచ్చాక ఆన్ లైన్ సమాచారం ప్రకారం 71.43శాతం పనులు జరిగినట్లుగా ఉందని పేర్కొన్నారు. ఇంతస్పష్టంగా సమాచారముంటే, మంత్రి అనిల్ పోలవరం పనులు 30శాతం జరిగాయని చెప్పడమేంటి? అని.. చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా 62సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించి, రూ.63,548కోట్లు ఖర్చుచేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 6ప్రాజెక్టులను మాత్రమే పూర్తిచేస్తామని చెప్పి, వాటన్నింటికీ కలిపి కేవలం రూ.1022కోట్లు మాత్రమే ఖర్చుచేశారన్నారు. అందులో పోలవరానికి పెట్టిన ఖర్చు రూ.171కోట్లు మాత్రమేనని… వైసీపీప్రభుత్వం ప్రాముఖ్యతనిచ్చిన 6 ప్రాజెక్టులకు చంద్రబాబునాయుడి ప్రభుత్వం 2014-19మధ్యన రూ.5వేలకోట్లకు పైగా ఖర్చుచేస్తే జగన్ కేవలం రూ.850కోట్లు మాత్రమే వెచ్చించాడని తెలిపారు.

Related posts