telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

సేవింగ్స్ ఖాతాల .. వడ్డీరేటు తగ్గించేసిన.. ఎస్బీఐ

sbi logo

గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఇప్పటివరకు ఖాతాదారులు ఎస్బీఐ సేవింగ్స్ ఖాతాలలో ఉన్న నగదుకు 3.5 శాతం వడ్డీ రేటు పొందుతున్నారు. కానీ నవంబర్ 1వ తేదీ నుండి వడ్డీ రేటు 3.5 శాతం నుండి 3.25 శాతానికి ఎస్బీఐ తగ్గించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో వడ్డీ రేట్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్బీఐ అందుబాటులో ఉంచింది. ఎస్బీఐ వడ్డీ రేటును తగ్గించటానికి కారణం రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రెపో రేటును తగ్గించటమే అని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.

అంటే లక్ష రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్న ఖాతాదారులు కూడా ఇక నుండి పావు శాతం తక్కువ వడ్డీని పొందుతారని సమాచారం. ఎస్బీఐ దగ్గర కావాల్సినంత లిక్విడిటీ ఉండటంతో ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలనే నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించటం పట్ల ఖాతాదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఎస్బీఐ ఖాతాదారులు ఉపయోగించే ఏటీఎం కార్డులను బట్టి నగదు విత్ డ్రా పరిమితిని పెంచి ఖాతాదారులను ఆకర్షించింది.

Related posts