అమరావతి పరిరక్షణ సమితి తలపెట్టిన మహాపాదయాత్ర తిరుమల చేరుకోబోతోంది. నెల రోజులుగా చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. శ్రీకాళహస్తి నుండి బయలుదేరిన పాదయాత్ర తిరుపతికి చేరుకోనుంది.అక్కడి నుండి తిరుమలకు వెళ్లి అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను ముగింపు చేస్తారు.
శ్రీకాళహస్తిలో బస చేసిన సందర్భంగా వసతి సదుపాయంతో పాటు ఆహార పానీయాల నీ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి,బిజెపి నుండి కోలా ఆనంద్ అందించారు. హైవే లోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతి సముదాయంలో అన్ని అందించే విధంగా సహకరించారు.పాదయాత్ర లో ఎక్కడ ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోడెల బాంబులకు భయపడలేదు..నీచ రాజకీయాలకు బలయ్యారు: దేవినేని