telugu navyamedia
రాజకీయ

పొర‌పాటున నోరు జారా .. క్షమించండి..రాష్ట్రపతికి అధీర్ రంజన్ చౌదరి లేఖ

*రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ కోరిన అధీర్ రంజన్
*పొర‌పాటున నోరు జారానంటున్న‌ ఎంపీ అధీర్‌

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ‘రాష్ట్రపత్ని’ అంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన లోక్‌ సభ కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ఆమెకు బ‌హిరంగంగా క్షమాపణలు చెప్పారు.ఈ మేరకు శుక్రవారం నాడు రాష్ట్రపతికి ఆయన లేఖ రాశారు.

మీరు చేపట్టిన అత్యున్నత పదవి గురించి చెప్పేందుకు పొరపాటున నోరుజారడం వల్లే ఆ పదం మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన తప్పును క్షమిస్తారని ఆశిస్తున్నట్లు లేఖలో రాసుకొచ్చారు.

కాగా..గత మూడు రోజులుగా అధీర్ రంజన్ వ్యాఖ్యలతో పార్లమెంటు ఉభయ సభలల్లో దుమారం చేలరేగింది. . అప్పటికే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు అధీర్ రంజన్ చెప్పినా..సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు.

పేద కుటుంబానికి చెందిన గిరిజన మహిళ చరిత్ర సృష్టించడాన్ని కాంగ్రెస్ నిరంతరం తక్కువ చేసి మాట్లాడుతోందని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ విమర్శించారు. అతున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతిని అవమానించేందుకు సోనియా అనుమతినిచ్చారని, ఒక పేద మహిళను అవమానించేందుకు ఆమె ప్రేరేపించారని, ప్రతి భారతీయ పౌరుడిని అవమానించేందుకు వీలు కల్పించారని స్మృతిఇరానీ వేలెత్తి చూపించి మాట్లాడడం సభలో గందరగోళానికి దారి తీసింది. ఓ దశలో ”మీరు నాతో మాట్లాడకండి” అంటూ స్మృతి ఇరానీని ఉద్దేశించి సోనియా అన్నారు.

కాంగ్రెస్​ శ్రేణులు నిరసన చేపట్టాయి. సోనియాకు స్మృతీ ఇరానీ క్షమాపణ చెప్పాల్సిందే అని డిమాండ్​ చేశాయి. ఈ కారణంతోనే శుక్రవారం ఉభయసభలకు అంతరాయం కలిగింది.

ఈ క్రమంలో అధీర్ రంజన్ శుక్రవారంనాడు నేరుగా రాష్ట్రపతికి క్షమాపణ లేఖ రాశారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది.

Related posts