అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. సముద్రంలో తమ ఓడలకు అడ్డుతగిలతే ఇరాన్ నౌకలను ధ్వంసం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలిచ్చారు. అడ్డంకులు సృష్టిస్తే ఇరాన్ గన్‌బోట్లను కాల్చిపారేసి ధ్వంసం చేసేయ్యాలనినావికా దళానికి ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ ట్వీట్ చేశారు.
ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో రాకపోకలు సాగిస్తున్న అమెరికా నావికాదళ నౌకలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్‌ప్రయత్నిస్తోందనే నేప్యథంలో ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తర అరేబియా సముద్రంలో ఐఆర్‌జీసీకి చెందిన నౌకలు పదేపదే అమెరికా ఓడలకు అడ్డుతగులుతూ ప్రమాదకరంగా సంచరిస్తున్నాయి. ఓడలు పరస్పరం ఢీకొట్టుకోకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపడతామని అమెరికా నేవీ ఈనెల 16న ట్వీట్ చేసింది.
హామీలను అమలు చేయకుండా వైసీపీ మాట మారుస్తోంది: లోకేశ్