telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణాకు ఏపీఎస్ఆర్టీసీ నడిపే బస్సుల రూట్లు ఇవే..!

apsrtc bus

లాక్‌డౌన్‌ కారణంగా ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీస్‌ రద్దయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ ముగిశాక..ఎన్నో చర్చలు, వాదోపవాదనల త్వరాత ఏపీ, తెలంగాణ మధ్య షరతులతో బస్సు సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. తాజాగా ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణకు నడపబోయే బస్సు సర్వీసుల వివరాలను ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం 13 జిల్లాలోని 12 రూట్లలో మొత్తం 638 బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ తిప్పనుంది. వీటిలో 534 బస్సులు హైదరాబాద్‌కు నడుపుతారు. తెలంగాణ ఇతర ప్రాంతాలకు 104 బస్సులను నడుపుతారు. ఇక విజయవాడ నుంచి తెలంగాణకు వెళ్లే రూట్ లో బస్సుల సంఖ్య బాగా తగ్గింది. గతంలో 264 బస్సులను నడపగా…ఇప్పుడు 166 కు పరిమితమైంది. ఇక 1, 60, 999 కిలో మీటర్లలో హైదరాబాద్‌కు 1,49, 998 కిలో మీటర్లు, తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు 11,001 కిలో మీటర్ల మేర నడిపేందుకు సిద్ధమైంది. గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ 2,65,367 కిలో మీటర్ల మేర తెలంగాణ భూ భాగంలో బస్సులు తిప్పేంది. కాగా.. ఖరారైన బస్సు రూట్లను టీఎస్‌ఆర్టీసీకి ఏపీఎస్‌ఆర్టీసీ పంపించింది. టీఎస్‌ ఆర్టీసీ కూడా తెలంగాణ నుంచి ఏపీకి ఇవే రూట్లలో తమ సర్వీసులు నడపనుంది. ఈ నెల 2న ఏపీ, తెలంగాణ మధ్య అంతరాష్ట్ర ఒప్పందం ఖరారైన విషయం విదితమే.

Related posts