రైతులు, మధ్యతరగతి ప్రజల పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం విమర్శించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా కొనసాగుతున్న నిరసనలో ఉద్యమించిన మరణించిన రైతులను పార్టీ గౌరవించాలని విజ్ఞప్తి చేసింది.
దిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన సోనియా.. “మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో తమ ప్రాణాలను త్యాగం చేసిన 700 మంది రైతులను గౌరవిద్దాం. రైతులు, సామాన్యుల పట్ల మోదీ సర్కార్‌కు చులకన భావం ఉందని ఆమె అన్నారు.
మోదీ ప్రభుత్వం భారతదేశ ఆస్తులను అమ్ముతోందని సోనియా ఆరోపించారు. ధరల పెరుగుదలతో దేశంలోని ప్రతి కుటుంబం యొక్క నెలవారీ బడ్జెట్‌ను కాల్చేస్తోంది. సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
“వ్యవసాయ రంగంలోని సమస్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. రైతులకు, వారి డిమాండ్లకు మద్దతుగా నిలుస్తుందని. కనీస మద్దతు ధర సహా ఉద్యమంలో మరణించిన రైతులకు పరిహారం విషయంలో కాంగ్రెస్.. అన్నదాతల పక్షానే ఉంటుంది.”
సరిహద్దు సమస్యలపై పార్లమెంటులో పూర్తి స్థాయి చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.పొరుగుదేశాలతో సంబంధాలపై సభలో చర్చించాలని అన్నారు.
రాజ్యసభలో 12 మంది విపక్ష సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని సోనియా తప్పుబట్టారు. సస్పెన్షన్ ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదని అన్నారు. సస్పెండ్ అయిన ఎంపీలకు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని ఆమె ప్రకటించారు.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సర్కారుకు సూచించారు సోనియా. దేశంలోని 60 శాతం మంది అర్హులకు సత్వరమే టీకా పంపిణీ పూర్తి చేయాలని అన్నారు.
మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు: విజయసాయిరెడ్డి