telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణాలో ఇక థర్మాకోల్‌తో తరగతి గదులు..

Degree exams TDP questiona Anantapur

తెలంగాణ ప్రభుత్వం పాటశాల  భవనాల  నిర్మాణంలో అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని భావిస్తోంది. ఎక్స్‌పాండెడ్‌ పాలి స్టెరీన్‌(ఈపీఎస్‌) టెక్నాలజీతో తరగతి గదుల నిర్మాణం చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో ఈ నిర్మాణాలతో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ను విద్యార్థుల కోసం అందించనుంది.ప్రస్తుతం థర్మాకోల్ తో ముందుగా సైఫాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ ప్రాంగణంలో పైలట్‌ ప్రాజెక్టుగా ఒక తరగతి గదిని నిర్మిస్తున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా థర్మాకోల్ తో క్లాస్‌రూమ్ లను నిర్మించనున్నారు.

సాధారణ పద్ధతిలో ఒక తరగతి గది నిర్మించాలంటే రూ.7లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ థర్మాకోల్ తో రూ.5 లక్షల ఖర్చుతోనే నిర్మించవచ్చు. సాధారణ కట్టడాల కంటే ఈపీఎస్‌ విధానంతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. తక్కువ సమయంలో భవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఈ విధానంలో నిర్మాణాలకు ప్రత్యేకమైన థర్మాకోల్‌ను ఉపయోగిస్తారు. ఈ నిర్మాణంలో ఇనుముకు బదులుగా స్టీల్‌ తీగలను వాడతారు. దానికి ఇసుక..సిమెంట్‌ కలిపిన మిశ్రమాన్ని అంటిస్తారు. రూమ్ నిర్మాణం కేవలం 20 రోజుల్లోనే పూర్తి అవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. ఇవి ఫైర్ ఫ్రూఫ్ మాత్రమే కాదు కరెంట్‌ షాక్‌ ప్రూఫ్‌గా కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

Related posts