ఆంధ్రా బ్యాంకు విలీనంపై తెలుగు రాష్ట్రాల్లో నిరసన వ్యక్తమవుతుంది. బ్యాంకు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ప్రజాప్రతినిధులు కేంద్రానికి లేఖలు రాస్తూ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు.
ఆంధ్రాబ్యాంకు విలీనంను ఆపివేయాలని కోరారు.
గత 96ఏళ్లుగా ఆంధ్రాబ్యాంక్ తో తెలుగు ప్రజలకు అనుబంధం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రాబ్యాంక్ విలీనం తెలుగు ప్రజల సెంటిమెంట్ ను దెబ్బతీసేలా ఉందని పేర్కొన్నారు. ప్రజల మనోభవాలను గుర్తుంచుకుని ఆంధ్రాబ్యాంకు విలీనంపై పునరాలోచించాలని లేఖలో పేర్కొన్నారు.