telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్‌ఎస్‌లో కరోనా కలకలం: ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా

చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే.. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ సురభి వాణిదేవికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది. “టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.” అంటూ సురభి వాణిదేవి వెల్లడించారు. కాగా.. ఇటీవలే హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సురభి వాణిదేవి ఘన విజయం సాధించారు. కాగా తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి.  తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 535 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక ముగ్గురు కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 278 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 3,06,339 కు చేరగా.. రికవరీ కేసులు 3,00,156 కు పెరిగాయి.. మరోవైపు.. ఇప్పటి వరకు కరోనాబారినపడి 1,688 మంది మృతి చెందారు. 

Related posts