telugu navyamedia
క్రీడలు వార్తలు

మ్యాక్స్‌వెల్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు…

చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గ్లేన్ మ్యాక్స్‌వెల్‌ను రూ. 14.25 కోట్లు పెట్టి తీసుకుంది. కానీ ఆర్‌సీబీకి ఒరిగేదేం లేదన్నాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్. ఏ ఐపీఎల్ సీజన్‌లో మ్యాక్స్‌వెల్ స్థిరంగా ఆడలేదని, అందుకే అతను లీగ్‌లో అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడని తెలిపాడు. అతను సరిగ్గా ఆడుంటే ఇన్ని ఫ్రాంచైజీలు తిరిగేవాడు కాదన్నాడు. ఇక కోల్‌కతా విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్‌తో అతనికి పోలీకే అనవసరం అన్నాడు. ‘ఆర్‌సీబీ మ్యాక్స్‌వెల్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. కానీ మ్యాక్స్‌వెల్‌ వారికి నిరాశను మిగిల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఏ ఐపీఎల్‌ సీజన్‌లోనూ మ్యాక్సీ ఆశాజనకమైన ప్రదర్శన నమోదు చేయలేదు. ప్రతీ సీజన్‌లో అతను విఫలమవుతున్నాడు. వాస్తవానికి అతని ఆటలో స్థిరత్వం లేని కారణంగా అన్ని ఫ్రాంచైజీలు చుట్టి వస్తున్నాడు. అతను బాగా ఆడి ఉంటే ఇన్ని ఫ్రాంచైజీలు మారే వాడు కాదు. అతను ఆసీస్‌ జట్టుతో పాటు అక్కడి లీగ్‌ల్లో మాత్రమే ఆడుతాడు తప్ప ఐపీఎల్‌లో అతనిపై కోట్ల వర్షం కురిపించినా ఆడడు. ఈ విషయం తెలియక మ్యాక్సీని ఆర్‌సీబీ వేలంలో తీసుకుంది అని గంభీర్ అన్నారు.

Related posts