telugu navyamedia
క్రీడలు

మంచినీటితో  కారు శుభ్రం.. విరాట్‌ కోహ్లీకి రూ.500 ఫైన్‌

london municipal office challan to kohli

రోజు వేల లీటర్ల మంచినీటిని వృథా చేస్తున్నవారి పై మున్సిపల్‌ కార్పొరేషన్‌ దృష్టి సారించింది.  మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆప్‌ గురుగ్రామ్‌(ఎంసీజీ) భారత క్రికెట్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి రూ.500 జరిమాన విధించింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంసీజీ చర్యలు చేపట్టింది. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్‌ ఫేజ్‌-1లో విరాట్‌ నివాసముంటున్న విషయం తెలిసిందే. ఇంటి ఆవరణలో ఆరు కార్లకు పైగా ఉంటాయి. కార్లను రోజు మంచినీటితో శుభ్రచేస్తుండటాన్ని గమనించిన విరాట్‌ పొరిగింటి వ్యక్తి ఎంసీజీకి ఫిర్యాదు చేశాడు. 

కార్లు శుభ్రం చేసేందుకు రోజు వేల లీటర్ల మంచినీటిని వృథా చేస్తున్నారని పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన ఎంసీజీ అధికారులు నీటి వృథా నిజమేనని తేల్చారు. విరాట్‌తో పాటు ఆ ప్రాంతంలోని ఇతర ఇండ్లలో సైతం మంచినీటి వృథాను గుర్తించిన అధికారులు జరిమానా విధించారు. వరల్డ్‌కప్‌ ఆడేందుకు  విరాట్‌ కోహ్లీకి  ప్రస్తుతం ఇంగ్లండ్‌ వెళ్ళిన విషయం తెలిసిందే.

Related posts