telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీకి మద్దతుగా సెహ్వాగ్…

gambir praised kohli on winning series

యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్‌కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లీసేన.. కీలకమైన ఎలిమినేటర్‌లో ఓడి మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమిపాలైంది. పుష్కర కాలంగా బలమైన జట్టుతో బరిలో దిగుతున్న బెంగళూరు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ ముద్దాడలేకపోయింది. దీంతో బెంగళూరు ఫాన్స్ మండిపడుతున్నారు.  ‘విరాట్ కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఐపీఎల్ లీగ్‌లో విజేతగా నిలవలేదని’, ‘విరాట్ టీమిండియాకు కూడా పెద్ద కప్పులు సాధించలేదు’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎనిమిదేళ్ల నుంచి కెప్టెన్‌గా చేస్తున్న కోహ్లి.. ఆ జట్టుకు ఒక్కసారి కూడా టైటిల్‌ సాధించి పెట్టలేకపోయాడని మాజీలు విమర్శిస్తున్నారు.

జట్టు వరుసగా పరాజయాలు చవిచూస్తున్నప్పుడు దానికి కెప్టెనే బాధ్యత తీసుకోవాలని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఎద్దేవా చేశాడు. కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ఇదే సరైన సమయమని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, గంభీర్‌ అభిప్రాయంతో మరో మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విభేదించాడు. కోహ్లిని కెప్టెన్‌గా మార్చాల్సిన అవసరం లేదు. అతని జట్టుకు సారథిగా మాత్రమే ఉన్నాడు. ఇక్కడ ఫలితాలు రాకపోవడానికి ఆర్సీబీ పూర్తిస్థాయి జట్టుతో ఏనాడు సిద్ధం కాలేదు.  టీమిండియాకు కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. మరి ఇక్కడ ఫలితాలు సాధిస్తున్నాడు కదా. వన్డేలు, టీ20లు, టెస్టులు ఇలా అన్నింటిలోనే కోహ్లి నాయకత్వంలోని భారత క్రికెట్‌ జట్టు మెరుగైన విజయాలు నమోదు చేస్తుంది. మరి ఆర్సీబీ ఎందుకు సాధించడం లేదంటే ఓవరాల్‌గా ఆ జట్టే బాలేదు. ఆర్సీబీలో ఇప్పటివరకూ మంచి బ్యాటింగ్‌ లైనప్‌ కన్పించలేదు. ఇప్పుడు ఆర్సీబీలో కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లు మాత్రమే ఉన్నారు. దాంతో వీరి స్థానాలను మార్చుకుంటూ కింది వరుసలో ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేశారు. కానీ అలా ఎప్పుడూ సాధ్యం కాదు. ఆర్సీబీకి ఒక స్పెషలిస్టు ఓపెనర్‌ కావాలి. అదే సమయంలో లోయర్‌ ఆర్డర్‌లో ఒక మంచి బ్యాట్స్‌మన్‌ ఉండాలని సెహ్వాగ్ తెలిపాడు..

Related posts