telugu navyamedia
Uncategorized క్రీడలు ట్రెండింగ్ వార్తలు

రోహిత్ కు అరుదైన గౌరవం.. ఆ ఇద్దరి తర్వాత..

ఐపీఎల్ టోర్నీలో ఆటగాడిగా ఆరు సార్లు ఛాంపియన్‌ జట్టులో ‘హిట్‌మ్యాన్’‌ సభ్యుడు. కెప్టెన్‌గా ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్‌లోనూ ముంబైని ఛాంపియన్‌గా నిలిపి.. తన జట్టును ఎవరికీ అందనంత ఎత్తులో పెట్టాడు. టీ20 లీగ్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ అవతరించాడు. మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ఖలీఫా ఎల్‌ఈడీ లైట్లతో కంగ్రాట్స్ చెప్పింది. మంగళవారం రాత్రి బూర్జ్ ఖలీఫాపై ముంబై ఇండియన్స్ అనే అక్షరాలను ప్రదర్శించారు. బాణాసంచా వెలుగు మధ్య నీలి రంగులో ముంబై ఇండియన్స్ అనే ఆంగ్ల పదాలు బూర్జ్ ఖలీఫాపై మెరిసిపోయాయి.

విజయం అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని కూడా బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బూర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం ఇదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఇక ఈ సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించిన సంగతి తెలిసిందేే. ముంబై ఇండియన్స్ అక్షరాలను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించిన ఫొటోను ముంబై తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఐపీఎల్ 2020లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ ‘గూగుల్‌’ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. గూగుల్‌లోకి వెళ్లి ముంబై జట్టు పేరుతో వెతికితే.. తారాజువ్వలు స్క్రీన్‌పై వెలిగేలా ఏర్పాటు చేసింది. కొన్ని సెకండ్ల పాటు అలా వెలుగుతాయి. ముంబై జట్టు వివరాలతో పాటు.. ఢిల్లీతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ స్కోరు బోర్డు కూడా స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి.

Related posts