సాధారణంగా కోతులు తమ చేష్టలతో అందరినీ ఆకట్టుకుంటాయి. బాలీవుడ్ నటి సౌందర్యశర్మ ఇంట్లోకి ప్రవేశించిన ఒక కోతి ఆ ఇల్లంతా తనదే అన్నట్టు వ్యవహరించింది. ఆ కోతి చేష్టలకు సంబంధించిన వీడియోను సౌందర్యశర్మ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ వానరం ఇంట్లో ఉన్న వస్తువులను చిందరవందర చేసింది. తరువాత అక్కడున్న తినుబండారాలను స్వాహా చేసి, మెల్లగా ఆమె బెడ్ రూం లోనికి ప్రవేశించి అక్కడ పడుకుంది. కాగా బాలీవుడ్ నటి సౌందర్యశర్మ 2017లో వచ్చిన “రాంచీ డైరీస్” సినిమాలో నటించారు.
previous post
కేవలం సోషల్ మీడియాలోనే దీని గురించి చర్చ… పిల్లలపై అనుష్క రియాక్షన్