telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

యువరాజుకు .. సరికొత్త అవకాశం.. అనుమతించిన బీసీసీఐ..

yuvaraj got new opportunities from torento

భారీ హిట్టింగ్ కు పర్యాయపదంలా విలసిల్లిన యువరాజ్ సింగ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. క్యాన్సర్ తో పాటు ఇతర గాయాలు, అనేక పరిణామాలు యువీ కెరీర్ ను దెబ్బతీశాయి. తనలో ఇంకా క్రికెట్ మిగిలే ఉందని బలంగా నమ్మే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ అయిష్టంగానే రిటైరయ్యాడన్నది తెలుస్తూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ఆటను మాత్రం ఇప్పట్లో విడిచిపెట్టేది లేదని యువీ బలంగా నిశ్చయించుకున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.

తాజాగా, యువరాజ్ కెనడాలో జరిగే గ్లోబల్ టి20 లీగ్ లో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజా సీజన్ లో యువీ టొరంటో నేషనల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. యువీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో బీసీసీఐ కూడా కెనడా లీగ్ లో ఆడేందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కాగా, యువీతో పాటు ఈ టోర్నీలో కీరన్ పొలార్డ్, బ్రెండన్ మెకల్లమ్, సునీల్ నరైన్, కేన్ విలియమ్సన్, డుప్లెసిస్, క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, క్రిస్ లిన్, డ్వేన్ బ్రావో, డారెన్ సామీ, షకీబల్ హసన్ వంటి స్టార్ ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు.

Related posts