telugu navyamedia
క్రీడలు వార్తలు

పటేల్‌కి కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్…

4 పరుగుల తేడాతో పటిష్ట రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై ఘన విజయం సాధించింది పంజాబ్ కింగ్స్. బెంగళూరు ఓటమికి ఆ జట్టు పేసర్ హర్షల్ పటేలే ప్రధాన కారణం. బౌలర్లకు అనుకూలిస్తున్న అహ్మదాబాద్‌ పిచ్‌పై హర్షల్ తన చివరి రెండు ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 20వ ఓవర్ బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్.. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా దెబ్బకి ఒకే ఓవర్‌లో 37 పరుగులు సమర్పించుకున్నాడు. 5 సిక్సర్లు, ఒక ఫోర్‌, రెండు పరుగులతో పాటు ఓ నోబాల్ కూడా వేశాడు హర్షల్. ఆ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోయింది. శుక్రవారం కింగ్స్‌పై కూడా అలానే బౌలింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హర్షల్ 18 పరుగులు ఇచ్చాడు. 19వ ఓవర్ వేసిన సిరాజ్ 7 పరుగులే ఇచ్చి కింగ్స్‌ను కట్టడి చేశాడు. ఇక 20 ఓవర్ వేసిన హర్షల్ 22 పరుగులు సమర్పించుకున్నాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్‌ అయిన హర్షల్.. తన కోటా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 53 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచులో హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తుంటే.. బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ పదేపదే నిరాశకు గురయ్యాడు. బంతులు ఎలా వేయాలో కూడా అతడితో చర్చలు జరిపాడు. అయినా కూడా లాభంలేకపోయిది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పటేల్‌కి కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ కనిపించాడు. ఇలా పరుగులు ఇస్తే కష్టం అని హెచ్చరించాడు. హర్షల్ స్లాగ్ ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చిన రెండు మ్యాచుల్లో బెంగళూరు ఓడిపోయింది. చెన్నై మ్యాచ్‌లోనూ హర్షల్‌ని కోహ్లీ వార్నింగ్ ఇచ్చాడు. హర్షల్‌పై బెంగళూరు అభిమానులు గుర్రుగా ఉన్నారు.

Related posts