telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

రాష్ట్రంలో ఎక్కడా వ్యాక్సిన్  కొరత లేదు : ఆళ్ళ నాని

ప్రస్తుతం ఏపీలో రోజుకు రెండు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే.. అయితే కరోనా ను ఎద్కోవటానికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టనున్నాం అని వైద్యారోగ శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని తెలిపారు. కోవిడ్ హాస్పిటళ్ళు, కోవిడ్ కేర్ సెంటర్లు, బెడ్స్ సంఖ్య పెంచమని సీఎం ఆదేశించారు. లాక్ డౌన్, కర్ఫ్యూ వంటివి అమలు చేసే ఆలోచన లేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… మాస్కులు, శానిటైజేషన్, భౌతిక దూరం పాటించటం‌, వ్యాక్సినేషన్ కు ముందుకు రావడం చేయాలి అని తెలిపారు. ఇవాల్టి వరకు రాష్ట్రంలో ఎక్కడా వ్యాక్సిన్  కొరత లేదు. 3.80 లక్షల డోసుల వ్యాక్సిన్ సిద్ధంగా ఉంది. కేంద్రానికి ఇండెంట్ పంపించాం. ఇవాళ, రేపటి లో 2 లక్షల డోసులు, వారంలో మరో 15 లక్షల డోసుల కేంద్ర నుంచి రానున్నాయి. రేపు కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో పర్యటించనున్నాను అని తెలిపిన ఆయన అక్కడ పలువురు అతిసార వ్యాధి బారిన పడ్డారు. ముగ్గురు చనిపోయారు. కారణాలు కనుక్కోవడం, బాధితులకు దగ్గర ఉండి వైద్యం అందించే ఏర్పాట్లు పర్యవేక్షించమని సీఎం ఆదేశించారు. ఈ పర్యటన తర్వాత క్షేత్ర స్థాయి పరిస్థితి పై ఒక నివేదికను సీఎంకు ఇస్తాను అని పేర్కొన్నారు.

Related posts