సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. నిర్జీవమైన పిచ్‌పై మొదటగా బ్యాట్స్‌మన్ పరుగులు చేయగా.. ఆపై బౌలర్లు సత్తాచాటడంతో ఆర్సీబీ అనూహ్య విజయం అందుకుంది. అనంతరం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ‘మేం అలసిపోలేదు. జట్టును చూసి గర్వపడుతున్నాను. వికెట్ మాకు సవాల్ విసిరింది. గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మ్యాచులోనూ ఇలాగే జరిగింది. చెన్నై పిచ్ నెమ్మదిగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆఖరి వరకు పోరాడాలి. మాకు ఎక్కువ బౌలింగ్ వనరులు ఉన్నాయి. దాంతో మధ్య ఓవర్లలో ప్రభావం చూపించాం. మేము అదనంగా ఉపయోగించిన బౌలింగ్ ఆప్షన్లు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపాయి. ‘మా వాళ్లకి నేను ఒక్కటే చెప్పా.. 149 పరుగుల స్కోరును చాలా ఇబ్బందిపడి సాధించామని అనుకోవద్దని చెప్పా. 150 పరుగుల లక్ష్యం కాపాడుకోవచ్చన్న విశ్వాసం నాకుంది. ఇన్ని పరుగులు చేయడం మనకు కష్టమైనప్పుడు అవతలి వాళ్లకూ అంతే కదా. వికెట్లు పోతున్నప్పుడు ఒత్తిడిలో ఛేదన ఎప్పుడూ సవాలే’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
previous post
next post