telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఆర్టీసీ హత్యకు ప్రభుత్వం కుట్ర: రేవంత్

Revanth-Reddy mp

ఆర్టీసీ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేబినెట్ సమావేశం అనంతరం నిన్న రాత్రి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ మీడియా సాక్షిగా ఏకపాత్రాభినయం బాగానే చేశారనిఎద్దేవా చేశారు.

ఆర్టీసీ విషయంలో ఇతర రాష్ట్రాలను ఉదాహరణలుగా చూపుతున్న కేసీఆర్.. పొరుగునే ఉన్న ఏపీ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఏపీ ప్రభుత్వం చూపుతున్న పట్టుదలను కేసీఆర్ ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించారు.

Related posts